Friday, February 15, 2019

మంచి పద్యం

నిర్మలమగు హాస్య మర్మవిభవమేమొ
పరమ యౌషధంబు పురమునకు
విషము వంటి దగును వేదనంబున నవ్వు
వినుర వినయశీల వెలుగుబాల !


మితము గారగించు మితముగా నిద్రించు
ఆచరించు మితము యమితమేలు
భాషణమున మితము బహువృద్ధి కలిగించు

వినుర వినయశీల వెలుగుబాల !


తిరిగి  చేయగల్గు దేహాదులుండగా
యుక్తి చాల గల్గి శక్తి దాచి
సేవకులకు వేరు దేవులాటేలరా

వినుర వినయశీల వెలుగుబాల !


నకలు గొట్టవలదు నష్టంబు లొనగూడు
అవ్విధంబు ద్రంచు మాది యందె
నకలు గిట్టు చదువు నగుబాటు కాదొకొ

వినుర వినయశీల వెలుగుబాల !



No comments:

Post a Comment