Tuesday, January 22, 2019

అవయవదానం మహాదానం.. అన్నిదానాలకంటే..అవయవదానం గొప్ప..

అవయవదానం మహాదానం.. అన్నిదానాలకంటే..అవయవదానం గొప్ప..
మనిషి చనిపోయాక తగలబెట్టటమో 
బొందపెట్టడమో చేస్తున్నాము . 
అంతేకాని ఏ కంపెనీలో తయారుకాని అవయవాలు 
ఎవ్వరూ తయారు చేయలేని అవయవాలు..
ఎంత వెలపెట్టినాదొరకని అవయవాలను...
మనం ఊరికే మట్టిపాలు చేస్తున్నాం ....
ఎలాగూ మనం పోయాక ఏమీ ఉండదు .....
కనీసం మనం మరొకరికి జ్ఞాపకంగా ఉందాం ...
అన్నీ అవయవాలు ఉండి మనం చస్తున్నాం ...
కొన్ని అవయవాలు లేక కొందరు బతుకుతున్నారు..
అందుకే చచ్చి పడున్న మన అవయవాలను బతికిద్దాం. మరొకరికీ బతుకునిద్దాం...
మనం చచ్చాక మన అస్థికలను గంగలో కలిపితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు కానీ...
మనం చేసే అవయవ దానం వలన మాత్రం ....
తప్పక పుణ్యం వస్తుంది....
చచ్చినోళ్ళందరూ కీర్తిశేషులు కారు ....
ఎందుకంటే వారు ఏ కీర్తి మూటగట్టుకున్నారో ఎవరికి తెలియదు ....కాని అవయవదానం చేసిన ప్రతి ఒక్కరూ కీర్తిశేషులే .....వీరి కీర్తిని లబ్ది పొందిన కుటుంబం ఎన్నటికీ మరవదు .....
తరతరాలు గుర్తుంచుకుంటుంది ....ఇంతకంటే మనం సచ్చి ఏం సాధించగలం ?అందుకే .....
మన కళ్ళు , లివరు , హార్టు , కిడ్నీ లు ఇలా ఏది అవసరమైతే అది ఇచ్చేద్దాం ....ఇంకో ప్రాణాన్ని బతికిద్దాం ..నేను సిద్ధం ...మీరు సిద్ధం కండి..
విశ్వనాథ బారికి..!!!

No comments:

Post a Comment