మంచి మాటలు
1) సమర్ధుడికి ఎదురు లేదు – అసమర్ధుడికి ఎదుగు లేదు ! కాబట్టి మీరు సమర్ధుడిగా ఉంటారో అసమర్దుడిగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి ----
2)డబ్బు ఎంత వున్నా సంపాదించలేని విలువలు కొన్ని వుంటాయి. అవి మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవరించుకొంటే మనం ధన్యులం కాగలం . మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి.. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటి వారి కష్టాలు మన కష్టాలుగా తలిచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చుచేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. --
3)మనిషిలోని ఆశకూడా మంచితనాన్ని పతనం చేస్తుంది. విఘాతాన్ని కల్గిస్తుంది.. కోర్కెలు తీరినా తీరకపోయినా ఆనందంగా వుండాలి. మంచి మార్గాలలో నడవాలి. మంచినే ఆచరించాలి. చేతితో మంచి పనులు చేయాలి. నోటితో మంచిమాటలు మాట్లాడాలి. వీటవలన ఆనందం కలుగుతుంది . . మంచి పలుకు- విను- చూడు ఇవే మంచి కార్యాలు. అవి మన జీవితంలో తోడుగా నిలుపుకుంటే చాలు మంచితనం అదే మనకు ఆభరణంగా నిలుస్తుంది. మంచితనమే మంచి సంస్కారం అనిపించుకుంటుంది. -
4)దేవుడు ప్రతి మనిషికీ విత్తనాలు యిస్తాడు. అవి మరేవో కావు,మన ఆనందం, ఆహ్లాదం, సంతోషం వాటిల్లో వుంటాయి. ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తేలా పంటలు పండి మనల్ని పరవశింపజేసేలా చేసుకోవడమన్నది మన చేతుల్లో వుంది. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే అవి మొలకెత్తవు. మనకు దుఃఖాన్ని మిగులుస్తాయి.కాబట్టి నువ్వు సంతోషంగా ఉండి ప్రక్కవాడ్ని కూడా సంతోషపెట్టు --
5)దుఃఖం నిండిన అనుభవం నుంచి వీలయినంత తొందరగా బయటపడాలని తపిస్తాం. ఆనందం నిండిన అనుభవం ఎప్పటికీ మనతోనే వుండిపోవాలని ఆరాటపడతాం. బాధలోనైనా, సుఖంలోనైనా ఆరాటమన్నది మామూలే . అవి రెండూ మనమనుకున్నట్లు శాశ్వతం కావు. పాదరసంలా అవి మన పట్టునుండి జారిపోతాయి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మన హద్దుల్ని దాటి మనల్ని మనం చూడగలగాలి..అలా చూసినప్పుడే మన మనస్సు స్వచ్ఛమయిన సరోవరంలా తళతళలాడుతుంది --
6)మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే అవతలి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న ఉత్సుకత చూపకుండా,ప్రక్క వాళ్ళతో పోల్చుకోకుండా వుంటే తప్పనిసరిగా జీవితాంతం సంతోషంగా ఉండగలము ----
7)అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు.. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికి తెలుసుకోలేడు. -
8)కష్టాలు నీ శత్రువులు కాదు.నీ బలాల్ని,బలహీనతలన్ని నీకు తెలిపే నిజమైన నేస్తాలు. ---
9)అందం లేని లోటును మంచి స్వభావం పురిస్తుంది మంచి స్వభావం లేని లోటును అందం పురించలేదు ---
10)మాట వినపడనివాడు చెవిటివాడు కాదు. మంచిమాట వినిపించుకోనివాడు నిజమైన చెవిటివాడు. ---
11. నీకు జీవితంలో ఆనందం కావాలా...?
అయితే ఎప్పుడూ ప్రేమను అర్ధించే వానిగా ఉండకు...
ప్రేమను అందించే వానిగానే ఉండు...
అప్పుడే నీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది...! విశ్వ..!
12. అన్నం పెట్టడం ఎంత అవసరమో
అంతే ఆదరణతో పెట్టడం అంతే అవసరం . ?
విశ్వనాథ..!!✍️✍️
13. మంచి కార్యాలు చేయలేకపోయనా చేసే వారికి కాస్త సాయం చేయగలిగినా కూడా మంచి పనులు చేసినట్టు అవుతుంది. మనిషి జన్మ పొందిన వారు వారి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దానికి మనసావాచా సిద్ధపడాలి. ప్రకృతిలోని చెట్టు చేమాలాగా, నీరు గాలి లాగా పరోపకార జీవనులై మెలుగుతూ నలుగురికీ మంచిచేసి పనులు చెయ్యాలి . వారు ఒకవేళ మరణించినా బతికున్న వారితో సమానం అవుతారు.
14. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 🌹ఈ సంక్రాంతి మీ ఇంటి ముందున్న రంగవల్లిక లాగా కళ కళలాడుతూ ఉండాలని ,మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాను..విశ్వ
No comments:
Post a Comment