Wednesday, April 10, 2019

ఓటు గురించి తెలుసుకో..

నీ ఓటే ఒక ఆయుధం


***నీ ఓటే ఒక ఆయుధం*** 

చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి
అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి
నీ ఓటే ఒక ఆయుధం....

నీ గుండెచప్పుడు గెలవటానికి 
నీ మనసు స్వచ్చత ను నిలపటానికి
నీ ఓటే ఒక ఆయుధం.....

రాజ్యాంగాన్ని తిరగరాసే సిరా ఏరా ఈ ఓటు ఆయుధం
రాజకీయవ్యవస్థను ప్రక్షాళన చేసే ఈ ఓటు ఆయుధం
నీ గళం సుస్థిరం కావాలంటే ఏమ
నవచైతన్య పునాదులు లేవాలంటే
నీ ఓటే ఒక ఆయుధం...

అంధకార చీకట్లు తోలగాలంటే
అదికార దాహాలను దించాలంటే
నీ ఓటే ఒక ఆయుధం....

 అవినీతిని బహిష్కరించటానికి
నిజాయితీ నీడ మిగలటానికి
నీ ఓటే ఒక ఆయుధం....

ప్రజల విలువ తెలియ చెప్పటానికి
ప్రజా క్షేమం కాపాడటానికి 
నీ ఓటే ఒక ఆయుధం....

ప్రతి మనిషి ఒక సైనికుడై రావాలి
నీ చేతిలో ఆయుధమే ఒక ఓటుగా
దానిని వాడి చూడు ఇక సూటిగా
వెలుగును చూపే సూర్యుడు నీవే
భవితను మలచే సమర్దుడు నీవే
కళ్ళు తెరచి చూడు
కుళ్ళు కడిగెయ్ నేడు
నీ అస్త్రం సందించి అర్జునుడు గా రా రా
శ్రమజీవులు అణ్వాయుధం ఈ ఓటురా
సమ సమాజ నిర్మాణం ఈ ఓటురా
నీ ఓటే ఒక ఆయుధం....


Friday, February 15, 2019

Golden Words

నువ్వు నిరుపేదవని అనుకోవద్దు,ధనం నిజమైన శక్తి కాదు..మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి......


కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి..కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు.. ఎంత కోరుకున్న కలిసి ఉండలేరు..


ప్పుడూ బాధ పడుతుంటే బ్రతుకు భయపెడుతుంది... అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది.


కోరిక కొన్నళ్లే బ్రతికిస్తుంది ...ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది..కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది

Motivational Words

Weak People REVENGE. Strong People FORGIVE. Intelligent People IGNORE. So think it. What you are..

No Matter how hard the Past ,You Can always begin again

Stress is not what happens to us. It's our Response to what Happens. And Response is something we can choose

Strength is Life, Weakness is Death.. Expansion is Life, Contraction is Death.. Love is Life, Hatred is Death

మంచి పద్యం

నిర్మలమగు హాస్య మర్మవిభవమేమొ
పరమ యౌషధంబు పురమునకు
విషము వంటి దగును వేదనంబున నవ్వు
వినుర వినయశీల వెలుగుబాల !


మితము గారగించు మితముగా నిద్రించు
ఆచరించు మితము యమితమేలు
భాషణమున మితము బహువృద్ధి కలిగించు

వినుర వినయశీల వెలుగుబాల !


తిరిగి  చేయగల్గు దేహాదులుండగా
యుక్తి చాల గల్గి శక్తి దాచి
సేవకులకు వేరు దేవులాటేలరా

వినుర వినయశీల వెలుగుబాల !


నకలు గొట్టవలదు నష్టంబు లొనగూడు
అవ్విధంబు ద్రంచు మాది యందె
నకలు గిట్టు చదువు నగుబాటు కాదొకొ

వినుర వినయశీల వెలుగుబాల !



Monday, January 28, 2019

అవయవా దానం.. ఆలోచించండి ...!!!!

అవయవా దానం.. ఆలోచించండి ...!!!!


ఈ పోస్ట్ ని నేను కేవలం awareness కోసమే రాస్తున్నాను ..... 

 

పుట్టేటపుడు  ఎం తెచ్చాము ???? ఫైకి  వెళ్ళే టప్పుడు ఎం తెసుకేలతాము ..??? ఏమి తెసుకేల్లము అని మన పెద్దలు చెబుతుంటారు ... కానీ మనం కరెక్ట్ గా  ఆలోచిస్తే  వెళ్ళే టప్పుడు మనతో పాటుగా మన శరీరం  లో  వేరొకరికి ఉపయోగపడే అవయవాలను  తెసుకేలుతున్నాము. 

మన ఒక్క భారత దేశం లోనే సుమారు గా  1 .1  మిలియన్ ప్రజలకు కంటి చూపు లేని వారు  ,౩౦ లక్షల మందికి  మానసిక వికలాంగులుగా .. ౩౦ లక్షల మందికి మాటలు మాట్లాడ రాకపోవడం , .. 15  లక్షల మందికి చెవులు వినబడక పోవడం .. ఇంక కిడ్ని లు పడఎపోయిన వాళ్ళు  , కాలేయం పడఎన వాళ్ళు .., చేతులు , కాల్లు లేని వాళ్ళు ఇలా.. ఇంక ప్రపంచం మొత్తం మీద ఎంత మంది వున్నారో ...??? ఆ దేవుడు మనకి ఏ లోటు లేకుండా అన్ని ఇచ్చాడు ...

మనం చనిపోయాక కూడా వేరే వారికీ ఉపయోగపడే ఈ అవయవాలను మనతో పాటు గా  తెసుకేల్లడం ఎంత వరకి కరెక్ట్ అంటారు ??? 

నేను చని పోయాక నాలో  ఉపయోగపడే అవయవాలన్నీ ఇతరులకు  ( ఉపయోగపడే వారికీ ) ఇవ్వాలని   కోరుకుంటూ  సుమారు గా ( 2 మే 2011 ) సంవత్సర క్రితమే గర్వగ్గా  సంతకం చేశాను . మీరు ఒకసారి ఆలోచించండి ...

Wednesday, January 23, 2019

పురాణాలలో దానం

వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.


బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.


శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.


కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.


ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు


అన్నదానం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని.నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.